బాబోయ్ ఈ అమ్మడికి మరో లక్కీ ఛాన్స్..!

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మాస్ క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఆ తర్వాత రెడ్ సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు.

అయితే రీసెంట్ గా తమిళ దర్శకుడు లింగుసామి తో కలిసి చేసిన ది వారియర్ మూవీ అంచనాలను అందుకోలేదు.

తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా మరోసారి రామ్ కి షాక్ ఇచ్చింది.

ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ చూసి రామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఈ క్రేజీ కాంబో సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల ఆ ఒక్క సినిమాతో అరడజను సినిమాలకు పైగా ఛాన్సులు అందుకుంది.

రవితేజతో ధమకా సినిమాలో నటిస్తున్న శ్రీలీల.వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ సినిమాలతో అమ్మడు తన సత్తా చాటనుంది.రామ్ బోయపాటి సినిమాలో కూడా శ్రీలీల లక్కీ ఛాన్స్ అందుకుంది.

ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.సినిమా కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ అడిగిందని టాక్.

ఫ్రెష్ ఫేస్ కాబట్టి ఆమె వల్ల సినిమాకు కొంత ప్లస్ అవుతుందని ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారట నిర్మాతలు.