తెలంగాణ బ‌హుజ‌న చైత‌న్యానికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ బ‌హుజ‌న చైత‌న్యానికి, మ‌హిళా శ‌క్తికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో ఆదివారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాక‌లి ఐల‌మ్మ వ‌ర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

 Chakali Ailamma Is A Symbol Of Telangana Bahujan Chaitanya , Telangana Bahujan C-TeluguStop.com

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య, ఆర్డీఓ ఆనంద్ కుమార్,రజక సంఘం రాష్ర్ట అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ లు వీరనారి చాక‌లి ఐల‌మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ సాయుధ ఉద్య‌మ స‌మ‌యంలో ఐల‌మ్మ చూపిన ధైర్య సాహ‌సాలు ఎన‌లేనివి అన్నారు.

ఆమె స్ఫూర్తి తో స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, మ‌హిళా అభ్యున్న‌తికి రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు.స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డాకతెలంగాణ పోరాట యోధుల‌ను ప్ర‌భుత్వం సమున్న‌తి రీతిలో స్మ‌రించుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాఘవేంద్ర, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, రజక సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube