ఇల్లు కూలిపోయిన బాధితురాలికి టార్ఫాలిన్ ఇస్తానని సర్పంచ్ హామీ

సర్పంచ్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి టార్ఫాలిన్( Tarphalin ) అందించిన ఉపసర్పంచ్ఆపదలో ఆదుకుంటున్న సర్పంచ్ అంటూ పలువురు ప్రశంసలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేటలో( Kishan Das Petalo ) గల నూకల ఎల్లవ్వ ఇంటిలో అద్దెకి ఉంటున్న ఒగ్గు నరసవ్వ కుటుంబ సభ్యులు.గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా ఇంటిపై కప్పు కూలి పడగా పెను ప్రమాదం తప్పింది.

 Sarpanch Assured To Give Tarpaulin To The Victim Whose House Collapsed , Sarpanc-TeluguStop.com

వెంటనే స్పందించిన కూలిపోయిన ఇంటి వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించి అధైర్య పడకండి మీకు నేను అండగా ఉన్నానని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అన్నారు.మీకు ఇంటి పై కప్పుకోవడానికి టార్ఫాలిన్ పరదాను ఇస్తానని హామీ ఇచ్చారు.

కాగా కూలిపోయిన ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటిలో కిరాయికి ఉంటున్న ఒగ్గు నరసవ్వ కుటుంబానికి సర్పంచ్ టార్ఫాలిన్ పరదాను ఇవ్వమని ఆదేశించగా ఈరోజు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అద్దెకుంటున్న నర్సవ్వ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.దీంతో ఆ కుటుంబం సర్పంచ్ వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉప సర్పంచ్ వెంట మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, నూకల శ్రీనివాస్ యాదవ్, కొర్ర వేణు యాదవ్, సంగ మల్లయ్య, ఏర్పుల హనుమయ్య, బాయికాడి చంద్రం ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube