రాజన్న సిరిసిల్ల జిల్లా : కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న చందుర్తి గ్రామానికి చెందిన గొల్లపల్లి గణేష్ కు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి బుధవారం స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్, సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో గణేష్ కు 1,10,000 నగదును అందజేయడం జరిగింది… ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ… ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అనారోగ్యంతో ఇండియాకు తిరిగివచ్చి అప్పుల పాలైన గణేష్ను ప్రభుత్వం ఆదుకోవాలని,
గణేష్ చికిత్స కోసం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు… గణేష్ కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడంతో స్పందించిన దాతలు రెండు రోజుల్లోనే 1,10,000 గణేష్ ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చిన దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు మహమ్మద్ జాకీర్, ఓరగంటి విజయ్, మేడిశెట్టి మధు, ఒరగంటి రాజేశం, గ్రామస్తులు ఒరగంటి దేవయ్య, లింగంపల్లి వెంకటి, రాగుల తిరుపతి పాల్గొన్నారు…
.