బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులకు జరిమానా

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామానికి చెందిన రంగు శ్రీనివాస్, అనంతారం గ్రామానికి చెందిన తీగల కనకయ్య లకు ఒక్కొక్కరికి బైండోవర్ లో సూచించిన జరిమానా ప్రకారం 30,000/- రూపాయలు విధించటం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి( DSP Uday Reddy ) తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పీ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామానికి చెందిన రంగు శ్రీనివాస్( Rangu Srinivas ), అనంతారం గ్రామానికి చెందిన తీగల కనుకయ్య,గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిబంధనలు విరుద్ధంగా గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారానే గత రెండు నెలల క్రితం రాబోవు ఎలక్షన్ లను ద్రుష్టి లో పెట్టుకొని ముందస్తు గా వీరిద్దరిని ఇల్లంతకుంట తహసీల్దార్ ఎదుట నిర్ణయించిన గడువు 6 నెలల లోపు మళ్ళీ అక్రమంగా బెల్ట్ షాప్ నడుపుతూ మద్యం అమ్ముతే అందులో నిర్ణయించిన షూరిటీ మొత్తం 30,000/- రూపాయలు జరిమానా పూచీకతో బైండోవర్ చేయటం జరిగింది.

 Penalty To Two Persons For Breach Of Terms Of Bindover , Dsp Uday Reddy, Rangu-TeluguStop.com

అయిన శ్రీనివాస్,కనకయ్య బైండోవర్ అయినప్పటికీ నిబంధనల విరుద్ధంగా మళ్ళీ బెల్ట్ షాప్ నిర్వహించి అక్రమంగా అమ్మడం జరుగగా ఇల్లంతకుంట తహసీల్దార్ తదుపరి చర్యలు తీసుకొమ్మని కోరగా జరిమానా విధించటం జరిగింది.త్వరలో జరగబోవు ఎలక్షన్ లని దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల సబ్ డివిజన్ ( Sirisilla Sub Division )పరిధిలో గల నేర చరిత, ఎలక్షన్ సమయం లో శాంతి భద్రత లకు విఘాతం కలిగించే వ్యక్తుల ను, మరి కొంతమంది ని ముందస్తు బైండోవర్( bindover ) చేయటం జరిగింది అని ప్రతీ ఒక్కరు శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణ కి సహకరించాలని నిబంధనలు అతిక్రమించి అనవసరం గా కేసులు చేసుకోవద్దు అని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube