ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనది.

రాజన్న సిరిసిల్ల జిల్లా: సాదారణ ఎన్నికల నేపద్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎన్నికల కోడ్ ( Election Code )అమలు అయినప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన ఎన్నికల కేసుల పై, ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులు,సిబ్బంది నిర్వహించవలసిన విధులు విధానాల పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనదని, ఆ ఎన్నికల పక్రియ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా,నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా విధులు నిర్వహించాలని,ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజూ,పోలింగ్ ముందు రోజు, పోలింగ్ తరువాతి రోజు పోలీస్ సిబ్బంది నిర్వహించవలసిన విధుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు

 Election Process Is Very Important In A Democracy , Rajanna Sirisilla District-TeluguStop.com

ఎన్నికల సందర్భంగా ఎవరైనా వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.భారత ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తూ, ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులు 15 నమోదు కావడం జరిగిందని ప్రస్తుతం ఆ నమోదైన కేసుల స్టేజ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఒక్క అధికారికి, సిబ్బందికి తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ కేంద్రాలు, రూట్ మొబైల్ గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.ఐ, బ్లూ కోల్ట్ సిబ్బంది పోలింగ్ కి రెండు మూడు రోజుల ముందు నుండి 24/7 పెట్రోలింగ్ చేస్తూ ఎన్నికల నియమావళి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.అదేవిధంగా రూట్ మొబైల్ అధికారులు,ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇంచార్జ్ ఇవ్వడం జరిగిందని వారు కూడా పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజు వారికి కేటాయించిన రూట్ లలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యల గురించి, పట్టిష్టమైన బందోబస్తు,కేంద్ర బలగాలు వినియోగం పై తగు సూచనలు సలహాలు చేశారు.

పోలింగ్ కేంద్రాలలో( polling stations ) సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.ప్రతి ఎలక్షన్ ఒక కొత్త అనుభవం నేర్పుతుందని అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తూ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ లో వాహనాల తనిఖీ డైనమిక్ చెక్ పోస్ట్ లు పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో అధనవు ఎస్పీ చంద్రయ్య( SP Chandraiah ), డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి, రవి కుమార్, సి.ఐ లు ,ఆర్.ఐ లు ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube