వృద్ధ మహిళాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ నిందుతురాలు అరెస్ట్

రెండు కేసులలో 38.06 గ్రాముల బంగారం,8 తులాల వెండి స్వాధీనం.రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla ):వృద్ధ మహిళాలే లక్ష్యంగా వారి ఆలోచన విధానాలను పక్కదో పట్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్,రెండు కేసులలో 38.06 గ్రాముల బంగారం,8 తులాల వెండి స్వాదినం,ముస్తాబద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సి.ఐ ఉపేందర్.మహిళ నిందుతురాలి వివరాలు.

 A Woman Accused Of Committing Thefts Targeting Elderly Women Has Been Arrested G-TeluguStop.com

వివరాల్లోకి వెళితే…తేది : 10.07.2023 రోజున ముస్తాబాద్ యస్.ఐ తన సిబ్బందితో యుక్తంగా నమ్మదగిన సమాచారం మేరకు ముస్తాబాద్( Mustabad ) బస్ స్టాండ్ వద్ద సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో వహనాల తనిఖీ చేయుచుండగా అనుమానాస్పదంగా కనిపించిన గంభీరావుపేట( Gambhiraopet ) గ్రామానికి చెందిన పాటి సునీత అను ఆమేను పట్టుకొని విచారించగా తను గంభీరావుపేట గ్రామ నివాసి అని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాను అని తెలిపి తాను ఈ సారి పంటలు బాగా పండకపోవటం వలన ఇల్లు గడవటం కష్టం అయిందని దానితో పాటుగా తాను కొన్న ట్రాక్టర్ లోన్ ఇన్స్టాల్ మెంట్ కట్టడం కష్టం అవుతుదని ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగతనాలు చేయాలని నిర్నంయించుకొని వృద్ద మహిళల వద్ద నుండి సులువుగా దొంగతనాలు చేయవచ్చు అనుకోని ఒంటరిగా ఉన్న వృద్దుల వద్దకు వెళ్లి వారికి మాయ మాటలు చెప్పి తన వెంట తెచ్చుకున్న కల్లును తాగించి వారిని పడుకోమ్మని చెప్పి వారు పడుకున్నాక వారి మేలలలోని బంగారు ఆభరణాలను దొంగతనం చేస్తున్నది.

తేది : 09.05.2023 రోజున నామాపూర్ గ్రామానికి చెందిన జంగిటి బాలవ్వ అను ఆమే వద్దకు వెళ్లి ఆమెకు కళ్ళు తాగించి ఆమె మేడలో నుండి బంగారు గుండ్లు, పడిగెలు, వెండి గాజులు ఎత్తుక వెళ్లడం జరిగింది.ఆ తర్వాత తేది : 03.07.2023 రోజున పోత్గల్ గ్రామానికి చెందిన మర్రిపల్లి నర్సవ్వ అను ఆమే ఫించన్ పైసల కోసం ముస్తాబాద్ బ్యాంక్ కి రాగా ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెకు కాళ్ళు తాగించి ఆమెను చేపల మార్కెట్, ముస్తాబాద్ కు తీసుకువెళ్ళి పడుకోబెట్టి బంగారు చైన్ ను ఆమె మేడలో నుండి ఎత్తుకు వెళ్లడం జరిగింది.ఈ రెండు కేసులలో పాటి సునీత ను ముస్తాబాద్ పోలీసులు ఈ రోజు ముస్తాబాద్ మండలంలోని బస్టాండ్ వద్ద సుమారు 12 గంటల సమయంలో అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని సి.ఐ ఉపేందర్ వెల్లడించారు.ఈ రెండు కేసులల్లో కీలక పత్ర పోషించిన చంద్రశేఖర్( Chandrasekhar ), రాజశేఖర్, శ్రీనివాస్, కుమార్, దామోదర్, వెంకటేష్ లను సి .ఐ అభినందించారు.ప్రజలకి విజ్ఞప్తి అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అలాంటి వ్యక్తులు మీద పోలీస్ వారికి సమాచారం అందించాలని, అదేవిధంగా నేరాల నియంత్రణలో, నేరస్తులకు శిక్షలు పడటంలో సీసీ కెమెరాల పత్ర కీలకం అని ప్రతి ఒక్కరు గ్రామల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సి.ఐ కోరారు.ఈ సమావేశంలో ముస్తాబాద్ ఎస్.ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది, చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్,హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube