తెలుగు స్టార్ దర్శకులు.చిన్న దర్శకులు అంతా కూడా తమిళ సంగీత దర్శకుల వైపు చూస్తున్నారు.
ఈ నేపథ్యం లో దేవి శ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) కాస్త ఎక్కువ ఖరీదు అవ్వడంతో పాటు ఆయన సక్సెస్ లను సొంతం చేసుకోవడం లో విఫలం అవ్వడం వల్ల ఆ మధ్య జోరు తగ్గినట్లుగా అనిపించింది.కానీ దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే దేవి శ్రీ ప్రసాద్ ఈ ఏడాది లో మూడు నాలుగు పెద్ద సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
పుష్ప సినిమా ( Pushpa movie )లోని పాటలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.మరో వైపు దేవి శ్రీ కి ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం జరిగిన థమన్ మాత్రం గత కొన్నాళ్లుగా మంచి సక్సెస్ లేక.మంచి మ్యూజిక్ ఆల్బమ్ ఇవ్వలేక కిందా మీద పడుతున్నాడు.ఇక అనిరుధ్ తో పాటు మరి కొందరు తమిళ తంబీలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి ట్యూన్స్ ను ఇవ్వడం లో విఫలం అయ్యారు.అందుకే మనోడే మంచోడు అన్నట్లుగా తెలుగు సినీ నిర్మాతలు.
దర్శకులు ఇంకా హీరోలు అంతా కూడా దేవి శ్రీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఆ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా కు థమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.కానీ ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల థమన్ ను తొలగించి దేవి శ్రీ ప్రసాద్ ను పెట్టాలని నిర్ణయించారు.కానీ పరిస్థితితులు అనుకూలించక పోవడంతో చేసేది లేక థమన్ తో కంటిన్యూ అవుతున్నారు.
గుంటూరు కారం సినిమా( Guntur Karam ) కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాల్సి ఉన్నా కూడా వీలు పడలేదు.కేవలం గుంటూరు కారం మాత్రమే కాకుండా ముందు ముందు చాలా సినిమా లు కూడా దేవి శ్రీ ప్రసాద్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తమిళ దర్శకులకు తెలుగు ఫిల్మ్ మేకర్స్ గుడ్ బై చెప్పే సమయం వచ్చిందేమో చూడాలి.