రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని బోయినిపల్లి,కోరెo గ్రామాలలో పంట నమోదు పరిశీలనలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి వి.భాస్కర్ ( V.
Bhaskar )15 సర్వేనెంబర్ లో ప్రత్యక్షంగా పంట చేనును చూడడం జరిగింది.దీనిలో భాగంగా 372 అనే సర్వే నంబర్లలో పర్లపల్లి లింగయ్య అనే రైతు కాకర మరియు బీర పంటలను డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చేయడం జరిగింది.561 డి1 కన్నం పరుశురాం అనే రైతు ఆయిల్ పామ్ పంటను సాగు చేయడం జరిగింది.చెన్నాడీ లింగారెడ్డి అనే రైతు 561 సర్వే నెంబర్ లో రెండు ఎకరాల 32 గుంటలలో బెండ, అలసంద మొదలైన కూరగాయ పంటలు వేయడం జరిగింది.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఎక్కువ నీరు ఉండకుండా, కాలువల ద్వారా నీటిని తొలగించుకోవాలని, ఆయిల్ ఫామ్ పంటలో కనిపిస్తున్న మొగి పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.ప్రస్తుతం కనిపిస్తున్న మొసాయిక్ వైరస్ సోకిన పంటల యొక్క ఆకులను తుంచి కాలబెట్టడం వలన వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీదేవి, రైతులు పాల్గొన్నారు.