గ్రామ పంచాయితీ కార్మికులు నిరసన మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపిన కార్మికులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రములో ఎంపిడిఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది.జిపి కార్మికులు కళ్ళు మూసుకొని నిరసన తెలిపారు.

 Gram Panchayat Workers Protested By Sitting On Their Knees , Knees-TeluguStop.com

ఈ సందర్భంగా మండల సీఐటీయూ కన్వీనర్ గురీజల శ్రీధర్( Gurijala Sridhar ) మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులు పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.గ్రామపంచాయతీ కార్మికులతో గ్రామాలలో అన్ని పనులను చేయిస్తూ, కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన పట్టంచుకోడం లేదని,మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి,పాత విధానాన్ని అమలు చేయాలి.

గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యంగా గ్రామపంచాయతీ కార్మికులపై వేధింపులు మానుకోవాలని తదితర డిమాండ్లతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల గ్రామ పంచాయతీ కార్మికులు అక్కనపల్లి లక్ష్మణ్, సంతపూరి సుమన్, కొట్టే కమలాకర్, కొండవేని నాగరాజు, పరశురాములు, నరేష్, సుమతి, దుర్గవ్వ, బాబు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube