12 వ తేదీ నూతన వ్యవసాయ కళాశాల భవనంకు ప్రారంభోత్సవం

-రాష్ట్రంలో రెండో అతిపెద్ద కళాశాలప్రారంభించనున్న మంత్రులు కే టి ఆర్, నిరంజన్ రెడ్డి, తదితరులు ప్రారంభోత్సవం కు అన్ని ఏర్పాట్లు చేయాలి :జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల ప్రారంభానికి సిద్ధమైంది.35 ఎకరాల విస్తీర్ణంలో 69.30 కోట్లతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటుచేసింది.16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, ఫాంలాండ్స్‌ను నిర్మించింది.అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ప్రయోగశాల, సెమినార్‌ రూములు, అధ్యాపకుల గదులు, అసోసియేట్‌ డీన్‌ చాంబర్‌, ఆధునిక లైబ్రరీ ఏర్పాటుచేశారు.ఈ నెల 12 వ తేదీన ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి మంత్రి కే తారక రామారావు కళాశాల భవనం , హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు.

 12th Inauguration Of The New Agricultural College Building, Agricultural College-TeluguStop.com

ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ క్షేత్ర స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను, హెలిప్యాడ్, సభాస్థలి నీ పరిశీలించారు.వ్యవసాయ కళాశాల భవనం ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న దృష్ట్యా….

కళాశాల ప్రక్కన సిద్ధం చేస్తున్న సభా వేదిక, ప్రజల కోసం ఏర్పాటు సిద్ధం చేయాలన్నారు.

వేదిక ప్రక్కన విఐపి లకు, మీడియా ప్రతినిధుల కు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు, రైతులకు, మీడియా ప్రతినిధులకు సరిపడా త్రాగునీటి, భోజన ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రారంభోత్సవం కు వచ్చే ముఖ్య అతిథులు,విఐపి లకు భవనం కు సంబంధించి సివిల్ స్ట్రక్చర్ తో పాటు అన్ని విభాగాల ఫంక్షనింగ్ ( పనితీరు ) తెలిసేలా ఏర్పాట్లు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ కు వైస్ సూచించారు.

పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, డీసీవో బుద్ద నాయుడు, పోలీసు అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube