సబ్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్ నాయకుల నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) గంభీరావుపేట మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని సబ్ స్టేషన్ల వద్ద కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy ) ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి రైతుల పట్ల చిన్న చూపును నిరసిస్తూ రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 Brs Leaders Protest At Sub Station Rajanna Sirisilla , Cm Kcr , Revanth Reddy-TeluguStop.com

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌పై రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టారని.

అరవై ఏండ్ల పాటు కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమ విధానాలతో దేశానికే ఆదర్శంగా మారామని తెలిపారు.దేశంలో రైతుబంధు ఎక్కడా లేదని కేసీఆర్ ( CM kcr )అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని వెల్లడించారు.

ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అని ప్రశ్నించారు.వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే సరిపోతుందని అనడం రైతులను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube