అధికార పార్టీ అన్యాయాలను ఎండగట్టాలి

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి బిజెపి కార్యకర్త పనిచేయాలిబీజేపీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు, గంభీరావుపేట మాజీ సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ పాల్గొనడం జరిగింది.అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాజన్ సంపర్క్ అభియాన్ 30రోజుల కార్యక్రమం గురించి కార్యకర్తలకు నాయకులకు వివరించడం జరిగింది.30 రోజుల కార్యక్రమంలో ప్రతి కార్యకర్త నాయకులు అందరూ పాల్గొనాలని కోరారు.బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని,గడీల పాలన అంతమొందించాలని బీఆర్ఎస్ పై కార్యకర్తలు ఉద్యమించాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని తెలిపారు.టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా రైతులను, నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఓడించి తీరుతారని తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కడతారని తెలిపారు.

 The Ruling Party Should Stop The Injustices , Repaka Ramachandra Reddy, Vangala-TeluguStop.com

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షుడు కోనేటి సాయిలు, చందుపట్ల రాజిరెడ్డి,కిరణ్ నాయక్, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, బొమ్మడి స్వామి,జితేందర్ రెడ్డి, రవి నాయక్, రేపాక రామచంద్ర రెడ్డి, వంగల రాజు,ఉడుగుల యాదగిరి, శ్రీకాంత్, ప్రశాంత్, పరుశరాములు,శ్రీశైలం,సాగ లక్ష్మణ్,సత్య రెడ్డి,ప్రకాష్,రాజు, మల్లయ్య, నరసింహులు, శరత్ రెడ్డి,శ్రీకాంత్,బోనాల సాయి కుమార్,మానుక అనూష్,ప్రశాంత్, దేవయ్య, సురేష్, బాలగౌడ్,లక్ష్మణ్, భాస్కర్, అనిల్,రాజు, రవి, వేణు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube