తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి - డిసిసి అధ్యక్షుడు అది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల వ్యాప్తంగా నిన్నటిరోజు కురిసిన భారీ రాళ్ళ వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను అలాగే తడిసిన ధాన్యం కుప్పలను రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ రాళ్ళ వర్షానికి పంట నష్టం జరిగి రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

 Government Has To Buy Every Tainted Nut Said Dcc President Adi Srinivas Details,-TeluguStop.com

పంట పొలాల్లో రాలిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని చూసి చలించిపోయి రైతు బాధను అర్థం చేసుకొని

జాయింట్ కలెక్టర్ కిమ్యా నాయక్ కి ఫోన్ చేసి తడిసిన ధాన్యాన్ని కొనాలని అలాగే రాలిన వడ్లకు ఎకరానికి 25000 ల రూపాయల నష్టపరిహారం అందించాలని జాయింట్ కలెక్టర్ ను అది శ్రీనివాస్ కోరారు.కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రారంభించాలని అలాగే లారీల కొరత ఉంటే రైతుల ట్రక్టర్ల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బిఆరెస్ ప్రభుత్వం తడిసిన ప్రతి గింజను కొనాలని

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

అలాగే రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి,ఎర్రం గంగనర్సయ్య, సుర యాదయ్య,మడిశెట్టి అభిలాష్, తర్రె లింగం,గంధం మనోజ్,అక్కీనపెళ్లి శ్రీనివాస్ ,ఇప్ప మహేష్, పుట్కాపు మహిపాల్,గంగం మల్లేశం,చెలుకల గంగాధర్, పుదారి మహిపాల్, పారందములు,సనుగుల గంగాధర్, బండారి మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube