సూర్యాపేట జిల్లా: విద్యుత్ షాక్ తో ఎద్దులు మృతి చెందిన విషాద ఘటన సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్దిరాల మండలం గుమ్మడవెల్ల గ్రామంలో జరిగింది.ఓయు విద్యార్థి భాషబోయిన వేణు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామంలో జక్కి శ్రీనివాస్ అనే రైతుకి చెందిన జత ఎడ్లు నీళ్ళు తాగడానికి వ్యవసాయ క్షేత్రంలోని బావి దగ్గరకు వెళ్ళి బొందలో నీళ్లు తాగి బయటకు వస్తుండగా అతని పొలంలోని విద్యుత్ స్తంభాల వైర్లు ఆ ఎడ్లకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.
గత కొన్ని నెలల నుండి తన పొలంలో విద్యుత్తు లైను చాలా కిందికి ఉండి, ప్రమాదకరంగా మారిందనివిద్యుత్ అధికారులకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీపట్టించుకోలేదని,చివరికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నా రెండు కోడె లేగలు విద్యుత్తు షాక్ తో మరణించాయని కన్నీటి పర్యంతమయ్యారు.దీనితో భారీగా నష్టం వాటిల్లిందని,తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం అందివ్వాలని బాధిత రైతు జక్కి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తూ తుంగతుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుంగతుర్తి నాగారం వెళ్లే రోడ్డుపై నిరసన వ్యక్తం చేశాడు.
ఆ రైతును ఆదుకోవాలని అతనికి ఓయూ విద్యార్థి నాయకుడు భాషబోయిన వేణు,రాజు పలువురు రైతులు వారికి సంఘీభావంగా నిరసన వ్యక్తం చేశారు.తక్షణమే జిల్లా అధికారులు స్పందించి మద్దిరాల మండలం విద్యుత్ అధికారులను ఏడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.