రేపే మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు,తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ సూర్యాపేటలోని గాంధీ పార్క్ లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు.గురువారం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే,సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో కలసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

 Repe Mallu Swarajyam Memorial Assembly-TeluguStop.com

సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం సభ విజయవంతం కోసం జిల్లా వ్యాప్తంగా సభలు,సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు.సభా ప్రారంభానికి ముందుగా కుడకుడ రోడ్డులోని బాలాజీ రైస్ మిల్ నుండి సాయంత్రం నాలుగు గంటలకు ప్రజా ప్రదర్శన ప్రారంభమై కొత్త బస్టాండ్,ఎంజీ రోడ్డు,శంకర్ విలాస్ సెంటర్,మార్కెట్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ మీదుగా గాంధీ పార్కు చేరుకుంటుందని తెలిపారు.

ఇప్పటికే మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ విజయవంతం కోసం పార్టీ శ్రేణులు జిల్లా మొత్తం పోస్టర్లు,కరపత్రాలు,ఫ్లెక్సీలతో,ఆటో ప్రచార జాతాలతో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సభకు సూర్యాపేట జిల్లాతో పాటు నల్గొండ,భువనగిరి జిల్లాల నుండి కూడా ప్రజలు,పార్టీ శ్రేణులు తరలిరానున్నట్లు చెప్పారు.

ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షత వహించనున్నారని,సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారని,వారితో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు,నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి,సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి,ఎంసిపిఐ జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు,రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు మరియు ఇతర వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొననున్నట్టు తెలిపారు.సభ అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడునని,ఈ సంస్మరణ సభకు పార్టీ శ్రేణులు,అభిమానులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube