గోధుమ గడ్డి రసం చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందిఆయుర్వేదం ప్రకారం ప్రతి రోజు పరగడుపున 30 ml గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.గోధుమ గడ్డి పొడిగా లేదా టాబ్లెట్ల రూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంది.
దీన్ని రసంగా తయారుచేసుకొని త్రాగితే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
గోధుమ గడ్డిలో జింక్, మెగ్నిషియం ఉండుట వలన శరీర వాపులను తగ్గించటమే కాకుండా అస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను తరిమి కొడుతోంది.
గోధుమ గడ్డిలో పీచు సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకానికి మంచి ఔషధం.గ్యాస్,అజీర్ణం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరికి చేరవు.
గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండుట వలన రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా రక్తం పెరిగేలా చేస్తుంది.రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధం.
ప్రేగుల్లోని చెత్త మరియు విషాలను బయటకు పంపి అల్సర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
గోదుమగడ్డిలో యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుంది.
గోధుమ గడ్డిని.ఇంట్లోని పూలకుండీల్లోనూ పెంచుకోవచ్చు.
అప్పుడు మార్కెట్ లో కొనే పొడికి బదులు ఇంటిలో పెరిగే గోధుమ గడ్డితో రసాన్ని తయారుచేసుకోవచ్చు.