త్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టాడా లేదా అనేది ముందు తేల్చాలని,ప్రస్తుతం ఆయనపై జరుగుతున్న ప్రచారం,వస్తున్న వార్తలు చూస్తుంటే నిజమేనా అనే సందేహం కలుగుతుందని వైయస్సార్ టీపీ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వర్లు అన్నారు.మంగళవారం గరిడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరిపోయాయని అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్,కేంద్రంలో బీజేపీ హరిచంద్ర,చింతామణి నాటకం ఆడుతున్నాయని మండిపడ్డారు.
అందులో కాంగ్రెస్ పార్టీ ఈ పాత్ర పాత్ర పోషిస్తుందని ఎద్దేవా చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోవడంతోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని ఆరోపించారు.కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నాయకులను కొనుగోలు చేసిన ఉత్తమ్ ఇప్పుడు తానే అమ్ముడు పోతున్నాడని ఆరోపించారు.
ఉప ఎన్నికల్లో పద్మావతి రెడ్డి గెలిచే అవకాశం ఉన్నా చివరి సమయములో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారి బయటకు రాలేదన్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తే ఓట్లేసిన ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తో ప్యాకేజీ కుదిరించుకున్నారని, ప్రజలు గమనించాలని అన్నారు.ఢిల్లీలో పద్మావతి రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మహిళ మంత్రులు ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగడం ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతిని పంపించారని వార్తలు వస్తున్నాయన్నారు.
ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా మౌనంగా ఉన్నారని, కేసీఆర్,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటయ్యారని, ఎమ్మెల్యే సైదిరెడ్డి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.