ఉత్తమ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హుజూర్ నగర్ఎ మ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ అభివృద్ధిని చూసి తట్టుకోలేని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేస్తున్నాడని,ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధిని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశానని అది చూసి ఓర్వలేక అసత్యాలను ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో పబ్బం గడుపుతున్నారని అన్నారు.

 Trs Mlas Fire On Uttam-TeluguStop.com

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మొత్తం కూడా హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసని,ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపైన అన్నిటిని కూడా ప్రజల్లో అపోహలు సృష్టించేలా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డినీ ఎప్పుడు ఎవరూ నమ్మరని అన్నారు.అనంతరం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల్లో ఆయన చేసిన అవినీతి ప్రజలకు అందరికీ తెలుసని,రాజకీయ విమర్శలు సహజమే కానీ,అవి శృతిమించేలా వ్యక్తిగత విమర్శలు కూడా సమంజసం కాదన్నారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిగట్టుకుని ఇల్లిల్లు తిరిగి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలపై తిరిగి అసత్య ప్రచారాలు చేస్తున్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube