మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి.బుధవారం రాత్రి శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ధ్వజారోహణం,ఏకాంత సేవ,యాగబలి,పండిత సన్మానం నిర్వహించారు.
శ్రీ పుష్పయాగం సందర్భంగా రంగురంగుల పూలతో స్వామి వార్లకు అభిషేకం చేసి అందంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్ కుమార్,కొరివి సతీష్, సట్టు పుష్ప,బంగారి చిన్నమల్లయ్య,లొడంగి నాగరాజు,అర్చకులు వరదాచార్యులు, రఘువరన్ ఆచార్యులు, రాఘవాచార్యులు, రామానుజచార్యులు, భక్తులు పాల్గొన్నారు.