ఇల్లు తాకట్టు పెట్టి వైద్యం... అయినా దక్కని భార్య ప్రాణాలు

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గంలో నెల రోజుల వ్యవధిలో విష జ్వరాల బారిన పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు.మొన్న మునగాల మండలం తాడ్వాయిలో సామాజిక కార్యకర్త రాగిచెట్టు శ్రీనివాస్,నిన్న అనంతగిరి మండలం వెంకట్రాంపురంలో ఈ మధ్య కాలంలో వివాహమైన పర్రే సాయితేజ (20) మృతి చెందడంతో వైరల్ ఫీవర్ అంటేనే ప్రజలు వణికిపోతున్నారు.మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం…అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన పర్రే వీరబాబు అదే గ్రామానికి చెందిన రేవెల్ల సాయితేజ 10 నెలల క్రితమే వివాహం చేసుకున్నారు.20 రోజుల క్రితం బ్రతుకుతెరువు కోసం కూలీ పనులకు నిజామాబాద్ జిల్లాకు వలస వెళ్ళారు.అక్కడ భార్య సాయితేజకు జ్వరంగా రావడంతో తిరిగి స్వగ్రామానికి వచ్చారు.

 House Is Mortgaged For Medical Treatment But The Life Of The Wife Is Not Availab-TeluguStop.com

జ్వరం తగ్గకపోవడంతో జులై 23 న కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు.

వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు డెంగ్యూగా నిర్ధారించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ కూడా మార్పు రాకపోవడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.తన భార్య బ్రతకాలని భర్త వీరబాబు తనకన్న ఇల్లు తాకట్టుపెట్టి రూ.ఏడు లక్షల వరకు అప్పు తెచ్చి వైద్యం చేయించాడు.కానీ,చివరకు జూలై 28న చికిత్స పొందుతూ సాయితేజ మరణించింది.

ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి వైద్యం చేయించినా భార్య ప్రాణాలు దక్కకపోవడంతో భర్త పెట్టే కన్నీళ్లు చూసి గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆసుపత్రి వారి నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన భార్యలాగా ఎవరికి జరగకూడదంటే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు సరైన వైద్యం అందించాలని వీరబాబు సోషల్ మీడియా వేదికగా వేడుకోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇదిలా ఉంటే కోదాడ డివిజన్ లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత పేరుకుపోయి, దోమలు,ఈగలు విపరీతంగా వ్యాప్తి చెంది విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.

అనేక గ్రామాల్లో,తండాల్లో గ్రామం మద్యంలో చెరువులను, అడవులను తలపించే విధంగా గుంతలు,చెట్లు,పిచ్చిమొక్కలు ఉండడం,వర్షపు నీరు రోజుల తరబడి నిలవ ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారై మురుగు నీరు,వర్షపు నీరు కలిసి దుర్వాసన వెదజల్లుతూ సీజనల్ వ్యాధులకు మూలంగా మారాయని ప్రజలు వాపోతున్నారు.దీనితో గ్రామీణ ప్రాంతాలోని ఆర్ఎంపి చికిత్స కేంద్రాలు,పట్టణ కేంద్రాల్లోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రిలు జ్వర పీడుతులతో కిక్కిరిసిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube