మస్జిద్ ల అభివృద్ధికి ప్రతి ముస్లిం పాటుపడాలి

సూర్యాపేట జిల్లా:మసీదుల అభివృద్ధికి ప్రతి ఒక్క ముస్లిం పాటుపడాలని నల్లగొండ ముఫ్తి సిద్ధిక్,వరంగల్ ముఫ్తి అజహార్ లు అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని రెండవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మస్జిద్ ఏ ఉమర్ మసీదును ప్రారంభించి మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం నిష్టగా ఉపవాసం ఉండాలన్నారు.

 Every Muslim Should Contribute To The Development Of Mosques-TeluguStop.com

నిష్టగా ఉపవాసం ఉండడమే కాకుండా నిరుపేద ముస్లిం కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.అందరూ కలసికట్టుగా ఉంటూ మసీదులను అభివృద్ధి చేసుకోవాలన్నారు.

నిత్యం ప్రార్థనలు చేసే మసీదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ముస్లిం సోదరులంతా కృషి చేయాలన్నారు.మౌలానా అత్హర్ సాహెబ్ అధ్యక్షతన ముఫ్తి హస్సాన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హఫీజ్ ఖలీల్ సాబ్,బౌఫిక్, ఉస్మాన్,దస్తగిరి,మౌలానా అబిద్,మౌలానా అస్రార్, రఫీయుద్దీన్,మస్జిద్ నిర్మాణ దాత సయ్యద్ సర్దార్,బకర్ సాబ్,పట్టణ ఉలామాలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube