మీకు తెలుసా? ఆయుర్వేదలో 7 విధాలుగా కొవ్వును తగ్గించుకోవచ్చు!

చాలా మంది బరువు తగ్గడానికి ఎక్సర్‌సైజ్‌లు, డైటింగ్‌ వంటివి చేస్తారు.నిజానికి అది వారి పుట్టుకతో వచ్చిన సమస్య కాదు.

 Can Burn Fat With 7 Methods Of Ayurveda, Belly Fat, Belly Fat Tips, Carbohydrate-TeluguStop.com

తీసుకునే ఆహారం ఇతర ఆరోగ్య సమస్యల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.దీంతో వారు నానా బాధలు పడాల్సి వస్తుంది.

అయితే, ఆయుర్వేదంలో బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.అవి పాటిస్తే కొవ్వు తగ్గే అవకాశం ఉందని ఆయుర్వేదిక్‌ ప్రాక్టీస్​నర్ డాక్టర్‌ శ్యాం వీల్‌ తెలిపారు.

సహజసిద్ధంగా ఒంట్లో కొవ్వును తగ్గించుకోవడమే మంచిదని ఈ డాక్టర్‌ సూచిస్తున్నారు.సులభమైన డైట్‌లు ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఫ్యాట్‌ తగ్గుతుంది.

దీనికి ఆయుర్వేదిక్‌ డాక్టరు బరువు తగ్గించుకోవడానికి తగిన సలహాలను వివరిస్తారని ఆయన తెలిపారు.

సాధారణంగా ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో 50 శాతం కేలరీలు లంచ్‌ సమయంలో తీసుకోవాలట.

ఎందుకంటే ఆ సమయంలో మన డైజెస్టీవ్ సిస్టం మెరుగ్గా పనిచేస్తుంది.తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని డిన్నర్‌ సమయంలో తీసుకోవాలి.

అది కూడా రాత్రి 7 గంటల సమయంలోపు తీసుకోవాలని డాక్టర్‌ శ్యాం సూచిస్తున్నారు.కార్బొహైడ్రెట్స్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి.

అంటే స్వీట్స్, తీయని పానీయాలు, ఆయిల్‌ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.

Telugu Ayurvedam Tips, Belly Fat, Belly Fat Tips, Benefits Ginger, Carbohydrates

మెంతులను డ్రై రోస్ట్‌ చేసి, మెత్తగా పొడి చేసుకోవాలి.ఉదయం నీటిలో కలిపి ఆ వాటర్‌ను ఖాళీ కడుపున తీసుకుంటే మంచిది లేదా మెంతులను రాత్రి గ్లాస్‌ నీటిలో నానపెట్టి ఉదయం తాగినా సరిపోతుంది.గార్సినియా కంబోజియా ఫ్రూట్‌ కూడా డైజెస్టివ్‌ విధానాన్ని మెరుగు చేసి, మెటబాలిజం లెవల్‌ను పెంచు తుందని శ్యాం తెలిపారు.

త్రిఫల చూర్ణం కూడా శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి జీర్ణాశయాన్ని మెరుగుపరుస్తుంది.

వాడే విధానం.

Telugu Ayurvedam Tips, Belly Fat, Belly Fat Tips, Benefits Ginger, Carbohydrates

ఒక టీ స్పూన్‌ త్రిఫల చూర్ణాన్ని వేడి నీటితో కలిపి డిన్నర్‌కు రెండు గంటల ముందు తీసుకోవాలి.శొంఠిలో కూడా ఫ్యాట్‌ను కరిగించే థర్మోజెనిక్‌ ఏజెంట్స్‌ ఉంటాయి.ప్రతిరోజూ శొంఠిని వేడినీటితో కలిపి తీసుకుంటే.బాడీ మెటబాలిజం పెరిగి, అధిక కొవ్వును కరిగించేస్తుందని డాక్టర్‌ అంటున్నారు.కడుపు, హృదయం మధ్య భాగాన్ని 30 నిమిషాలు పట్టుకుని కాస్త స్పీడ్‌గా నడిచే విధానంతో బెల్లీ ఫ్యాట్‌కు సులభంగా చెక్‌ పెట్టొచ్చట.దీంతోపాటు యోగా, పైలేట్స్‌ కూడా మంచిదట.

అలాగే ఎప్పుడైనా దాహంగా ఉన్నపుడు గోరువెచ్చ నీటిని తీసుకుంటే మెటబాలిజం లెవల్‌ యాక్టివేట్‌ అవుతుంది.ఇది వెయిట్‌ లాస్‌కు దోహదపడుతుంది.

అంతేకాదు, ఆహారాన్ని బాగా నమిలి మింగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube