మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో మన్యంకొండలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు.ప్రతి సాయంత్రం సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను చూస్తారని, ఎవరు ఎక్కడ ఏం కొన్నారన్నది చూస్తారని చెప్పారు.
ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి.ఎవరి భూములు లాక్కోవాలా అని చూస్తారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులకు భూ హక్కు కల్పిస్తామని తెలిపారు.అదేవిధంగా జీఎస్టీలో సవరణలు చేస్తామని పేర్కొన్నారు.
దేశంలో నిరుద్యోగం పెరగడానికి నోట్ల రద్దు, జీఎస్టీనే కారణమని మండిపడ్డారు.