సూర్యాపేట జిల్లా:టిక్కెట్ రాకుంటే పార్టీ మారే తత్వం నాది కాదని,పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని,నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదని,తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఇలాంటి భవిష్యత్తులో పునరావృతమైతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.