నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో అగ్ని మాపక కేంద్రం,(ఫైర్ స్టేషన్) ఏర్పాటు చేయాలని టిడిపి సీనియర్ నాయకులు ఇంజమూరి వెంకటయ్య సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జిల్లాలోని నేరేడుచర్ల, పాలకవీడు,గరిడేపల్లి,పెన్ పహాడ్ మండలాలకు సమీపంలో ఫైర్ స్టేషన్ లేదని, నేరేడుచర్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా 4 మండలాల పరిధిలో అగ్ని ప్రమాదాలతో ఆస్తి,ప్రాణ నష్టాలు జరుగకుండా కాపాడవచ్చన్నారు.
హుజూర్ నగర్ ఎమ్మెల్యే,రాష్ట్ర భారీ నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయడానికి కృషి చేయాలని కోరారు.