సూర్యాపేట జిల్లా: శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మేనిపెస్టోలో పేర్కొన్న విధంగా లక్ష రుణమాఫీని వడ్డీతో సహా మాఫీ చేసి అమలు చేయాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.గురువారం గరిడేపల్లి మండల తాహాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చుతారనే నమ్మకంతో ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తే ప్రస్తుతం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు.90 వేల రూపాయల లోపు రుణాలు మాత్రమే మాపీ అవుతాయని ప్రచారం జరుగుతోందని,దీనితో రైతులు అయోమయంలో ఉన్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీతో రైతులు బ్యాంక్ ల నుండి తీసుకున్న రుణాలను చెల్లించలేదని గుర్తుచేశారు.
రైతులు తీసుకున్న అప్పు కంటే వడ్డీల భారం ఎక్కువైందని,దీంతో బ్యాంక్ అధికారులు మొండి బకాయిలుగా చూపిస్తూ రైతులను అవమానకరంగా బాధిస్తున్నారని,దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున వెంటనే రైతు రుణమాఫీ వడ్డీతో సహా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సాగర్ ఆయకట్టకు క్రమం తప్పకుండా నీటి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, కడియాల అప్పయ్య,రైతు సంఘం నాయకులు, మెండే వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ తిరపయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.