సూర్యాపేట జిల్లా:కుల,మతాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు నాగరాజును హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని,కులాంతర మతాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో కులం,మతం పేరుతో పరువు హత్యలకు పాల్పడం చూస్తుంటే మనం ఆటవిక యుగంలో ఉన్నామా అనిపిస్తుందన్నారు.
పరువు పేరుతో మనుషుల ప్రాణాలు తీసే సంస్కృతిని ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలని,కులాంతర,మతాంతర పెళ్లిళ్లు చేసుకున్న వారిని హతమార్చుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,ప్రజాసంఘాల నాయకులు ఎలుగూరి గోవింద్,వేల్పుల వెంకన్న,దనియాకుల శ్రీకాంత్, చినపంగి నర్సయ్య,వల్లపుదాస్ సాయికుమార్, మామిడి సుందరయ్య,ఎం.
వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.