సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలంలోని అంగన్వాడి వర్కర్స్,ఆయాలు శుక్రవారం మండల కేంద్రంలో సిఐటియు సూర్యాపేట జిల్లా నాయకులు ఎస్కే.యాకూబ్ సమక్షంలో భారీగా చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల ఆలోచన,ఆర్థిక విధానాల మూలాన ఐసిడిసి మొత్తం నిర్వీర్యమైందని,గత ఎనిమిది సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్ల,ఆయాల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యానికి గురిచేశారని విమర్శించారు.కార్మిక పక్షాన సమస్యలే ప్రధాన ధ్యేయంగా సిఐటీయు పోరాటం చేస్తుందని తెలిపారు.
సుప్రీంకోర్టు జీవో ప్రకారం ప్రతి టీచర్ కి ఇంటి బిల్లులు వెంటనే చెల్లించాలని, రాజకీయ ఒత్తిళ్లు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.సిఐటియులో చేరిన వారికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు.