సూర్యాపేట జిల్లా: సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడం కోసం తెలంగాణ పోలీసు శాఖలో ఫంక్షన్ వర్టికల్ పని విభాగాలను నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.జిల్లాలో అమలవుతున్న పోలీసు ఫంక్షనల్ వర్టికల్ పని విభాగాలపై జిల్లా పోలీసు అధికారులు,సిబ్బందితో అంతర్జాల శిక్షణను నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పని విభాగాలను సమర్థవంతంగా నిర్వహిస్తే పనులు పెండింగ్ ఉండవని ఎస్పీ సిబ్బందికి తెలిపారు.సాంకేతికత అభివృద్ధితో ముందుకు వెళుతున్న సమాజములో సిబ్బంది అత్యంత నైపుణ్యంతో పని చేయాలని ఎస్పీ కోరారు.
రోజూవారి పనులను పర్యవేక్షణ చేస్తూ వేగంగా సేవలు అందించాలని అన్నారు.పనులు పెండింగ్ పెట్టితే వత్తిడి పెరిగి ముందుకు వెళ్లలేమన్నారు.
వత్తిడి లేకుండా పని చేయాలని సూచించారు.కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి,రిషప్షన్ సిబ్బంది బాధితులతో బరోసగా మాట్లాడాలి, పెట్రోకార్,బ్లూ కొట్స్ సిబ్బంది పిర్యాదులపై వేగంగా స్పందించాలని,కోర్టు డ్యూటీ సిబ్బంది,టెక్ టీమ్స్ సిబ్బంది బాగా పని చేయాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు సీఐలు,ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.