గ్యాస్ డీలర్ల బ్లాక్ దందా...!

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం వినియోగదారులకువివిధ ఎల్పీజీ డీలర్ల( LPG Dealers ) ద్వారా అందిస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు జిల్లాలో పక్కదారి పడుతూ యధేచ్చగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయనిఆరోపణలు వినిపస్తున్నాయి.జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, కోదాడ,తుంగతుర్తి,హుజూర్ నగర్( Huzur Nagar ) నియోజకవర్గాల పరిధిలో పదుల సంఖ్యలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలువెలిశాయి.

 Gas Dealers Blackmail...! , Gas Dealers , Central Govt , Huzur Nagar-TeluguStop.com

వీరంతా గృహ అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లను అక్రమ సంపాదమే ధ్యేయంగా పలువురు డీలర్లు, హోటళ్లకు,రెస్టారెంట్లకు పెద్ద సంఖ్యలో బ్లాక్ మార్కెట్ కి తరలించి, డబుల్ రేటుకి విక్రయిస్తూఅక్రమార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లోని హోటళ్ళు, రెస్టారెంట్లు,బార్లు,ఫుడ్ సెంటర్లలో ఎక్కడ చూసినా గృహ అవసరాల కోసం వినియోగించే సబ్సిడీ సిలిండర్లే దర్శనమివ్వడంగ్యాస్ డీలర్లు బ్లాక్ దందాకు అద్దం పడుతుందని,గృహ అవసరాల కోసం ఇచ్చే సిలిండర్ ధర రూ.1120 ఉండగా బ్లాక్ మార్కెట్లో రూ.2000 లకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది.గ్యాస్ బుకింగ్ చేసుకున్నా కూడా సరియైన సమయానికి అందిస్తలేరని,ట్రాన్స్పోర్ట్ చార్జీ పేరుతో అదనంగా రూ.40 నుండి రూ.60 వరకు వసూల్ చేస్తున్నారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.ఇదంతా సివిల్ సప్లై అధికారులపర్యవేక్షణ లోపం వల్లే జరుగుతుందని,గృహ అవసరాలకు కోసం ఇస్తున్న సిలిండర్ నుంచి డొమెస్టిక్ సిలిండర్ లోకి పంప్ చేస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఏజెన్సీలకు వెన్నుదన్నుగా మారారని,డీలర్లకు అధికారులకు మధ్య డీల్ కుదరడంతోనే గ్యాస్ అక్రమ వ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా సాగుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ( Central Govt )ఇచ్చే సబ్సిడీని డిస్ట్రిబ్యూటర్లు, అధికారులు కుమ్మక్కై రాయితీకి పంగనామాలు పెడుతున్నట్లు గుసగుసలు వినిపిసస్తున్నాయి.దీనితోలక్షల్లో రాయితీ సొమ్ము వృధా అవుతుందని కష్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా గ్యాస్ గోడౌన్లు నివాసాల మధ్యలో ఉండడంతో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా గ్యాస్ ఫిల్లింగ్ చేయడంతోపరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఫిల్లింగ్ సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని,జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని, అధికారులు ఫిల్లింగ్ చేసే వారి నుండి లక్షల్లో వసూలు చేస్తున్నారని,అందుకే చర్యలు లేవని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి,గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube