ప్రతి కుటుంబం ఆయుష్మాన్ భారత్ లో చేరి ఐదు లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమాను పొందాలని బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గుండగాని జానీ గౌడ్ అన్నారు.గురువారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని 9,15 వ వార్డుల్లో వార్డు అధ్యక్షులు జోగం శ్రీనివాస్,మరియు 32 వ వార్డులో పట్టణ నాయకులు తోణుకునూరి సంతోష్ నేతృత్వలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాలను ప్రారంభించారు.
వార్డు ప్రజలందరూ ఆయుష్మాన్ భారత్ లో చేరే విధంగా ఉచితంగా ఎన్రోల్మెంట్ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం దేశం గర్వించదగినదని,పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంలా మారబోతుందన్నారు.
ఒక కుటుంబం ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా పాలసీ పొందాలంటే బయట దాదాపు పదివేలకు పైగానే ఖర్చు అవుతుంది.కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద,మధ్యతరగతి వర్గాల కష్టాలను గుర్తించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రతి కుటుంబo ఉచితంగా ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య భీమా పొందే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు.
ఈ పథకాన్ని 2018 సంవత్సరంలోనే నరేంద్ర మోడీ దేశంలో ప్రవేశపెట్టినప్పటికీ తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ అడ్డుకోవడం జరిగిందని ఆరోపించారు.ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేద,మధ్య తరగతి వర్గాల వారికి ఉపయోగపడే ఈ పథకాన్ని ప్రచారంలోకి తీసుకురావడం లేదని, అందుకే తాము పార్టీ పక్షాన ప్రజలను చేరువ చేస్తున్నామని చెప్పారు.