మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని,అర్హులైన పేదలకు పెన్షన్లు,ఇళ్లు,మంజూరు సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడాతూ మున్సిపల్ పరిధిలో అంతర్గత రహదారులను పూర్తి చేసే లోపు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకి అసౌకర్యం కలాగకుండా చూడాలని కోరారు.

 Cpm Dharna In Front Of Municipal Office-TeluguStop.com

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా,రోడ్లు డ్యామేజి అయ్యేలా నాసిరకమైన పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి,ఎలుగూరు గోవిందు,మేకనబోయిన సైదమ్మ,సిపిఎం టూ టౌన్ కార్యదర్శి బత్తుల వెంకన్న, పట్టణ నాయకులు మామిడి సుందరయ్య,వల్లపుదాస్ సాయికుమార్, కొండేటి ఉపేందర్,అర్వపల్లి లింగయ్య,పందిరి సత్యనారాయణరెడ్డి,వీరారెడ్డి,కేశవరెడ్డి,భాగ్యమ్మ, భిక్షమమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube