ఉత్తమ్ కుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి..: ఎమ్మెల్యే శానంపూడి

కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.ఈ మేరకు ఉత్తమ్ కుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

 Uttam Kumar Should Avoid Politics..: Mla Sanampudi-TeluguStop.com

ఓడిపోతాననే భయం ఉత్తమ్ కుమార్ కు పట్టుకుందని ఎమ్మెల్యే శానంపూడి అన్నారు.అలాగే ఉత్తమ్ కుమార్ లా ప్యాకేజీ రాజకీయాలు చేయడం తనకు చేతకాదని చెప్పారు.

ఈ క్రమంలోనే ఉత్తమ్ ఎంత రెచ్చగొట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.ఉత్తమ్ కోసం పనిచేసే ఏజెన్సీ వాళ్లు తమ దగ్గర పని చేస్తున్నారన్న ఆయన ఉత్తమ్ తో చేతులు కలిపి గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

అయితే ఆ విషయం తనకు నిన్నటి వరకు తెలియదని చెప్పారు.సదరు ఏజెన్సీ సంస్థ ఇరువురికి పని చేయడం అనైతికమని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఏజెన్సీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube