మనుషుల్లో ఒకరు మాస్ మరొకరు క్లాస్ అంటూ ఉన్నట్లుగానే అటు హీరోలలో కూడా క్లాస్ మాస్ ఇమేజ్ ఉంటుంది.ఎక్కువ మంది హీరోలు అయితే మాస్ ఇమేజ్ సంపాదించడానికి తెగ కష్టపడి పోతుంటారు.
ప్రేక్షకులు మాత్రం ఎంత ఊరమాస్ ప్రయత్నాలు చేస్తున్నా ఆ హీరోలని కేవలం క్లాస్ హీరోగానే చూడటం చేస్తూ ఉంటారు.దీంతో చాలా మంది హీరోలు ఇప్పుడు వరకు మాస్ మంత్రాన్ని పట్టుకుని చేతులు కాల్చుకున్న వారు ఉన్నారు.
అంతేకాదండోయ్ ఇండస్ట్రీలో లవ్ రొమాన్స్ ఫ్యామిలీ అండ్ కామెడీ జానర్ లు చేసి గుర్తింపు సంపాదించుకున్న హీరోలకు ఎక్కువ అవకాశాలు రావని ఇక కెరియర్ కాలం కూడా తక్కువగానే ఉంటుందని ఒక వాదన కూడా ఉంది.
అందుకే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరో మాస్ ఇమేజ్ రావాలని.
సినిమాలు ప్లాన్ చేస్తూ ఉంటారు.అయితే మొన్నటి వరకూ క్లాస్ ప్రేక్షకులను అలరించిన వారు ఇప్పుడు ఊర మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆ వివరాలేంటో తెలుసుకుందాం.అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు వరకు క్లాస్ హీరోగానే ప్రేక్షకులకు పరిచయం.
కానీ ఏజెంట్ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు.మరి అతని ఊరమాస్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
నాచురల్ స్టార్ నాని ఫ్యామిలీ కామెడీ ఇలా పలు రకాల జానర్లను టచ్ చేసి హిట్ కొట్టాడు.కాని మొదటి సారి ఊర మాస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు.ఇక లవర్ బాయ్ గా పేరున్న నాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో ఊర మాస్ కథాంశం తో ఎలా ప్రేక్షకులను అలరించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చి హిట్టు కొట్టిన వైష్ణవ్ తేజ్ కి కూడా క్లాస్ ఇమేజ్ వచ్చి పడింది.
ఆ తర్వాత కొండపొలం వచ్చినా పెద్దగా అతనికి గుర్తింపు తెచ్చి పెట్టలేదు.రంగ రంగ వైభవంగా సినిమా లో కూడా పెద్దగా మాస్ లేదు అన్నది తెలుస్తుంది.
ఈ క్రమంలోనే నాలుగొ సినిమాలో మాత్రం మాస్ ఆడియన్స్ ని ఆకర్షించాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టాడట వైష్ణవ్.
కేవలం సినిమాలు చేయడం కాదు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు శ్రీ విష్ణు.ఈ క్రమంలోనే ఇటీవల శ్రీ విష్ణు సినిమా వచ్చిందంటే చాలు ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.ఇకపోతే ఇటీవలే ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు.
వీళ్ళు మాత్రమే కాదండోయ్ ప్రస్తుతం టాలీవుడ్లో క్లాస్ హీరోలుగా పేరున్న శర్వానంద్, సాయికుమార్, అల్లరి నరేష్, విజయ్ దేవరకొండ, నిఖిల్, నితిన్ అందరూ కూడా మాస్ మంత్రాన్ని జపిస్తూ మాస్ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.