లక్ష్యం చేరుకోవడానికి మెడిటేషన్ అవసరం

సూర్యాపేట జిల్లా:జిల్లా యంత్రాంగం,జిల్లా పోలీసు అధ్వర్యంలో ఉచిత శిక్షణలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు 3 రోజుల పాటు మెడిటేషన్ తరగతులను నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ,విజయ్ ఫంక్షన్ హాల్ లో హర్ట్ ఫుల్ నెస్ ధ్యానకేంద్రం,సూర్యాపేట వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిటేషన్ తరగతులను ఎస్పీ ప్రారంభించారు.

 Meditation Is Necessary To Reach The Goal-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత శిక్షణలో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ సాధనలో ఈ మెడిటేషన్ ఉపయోగ పడుతుందని అన్నారు.మెడిటేషన్ నిచ్చలమైన మనసు,ఏకాగ్రత కలిగి ఉంటుందని,మనసు, ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు.

మెడిటేషన్ చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుందన్నారు.మూడు రోజుల పాటు ఈ తరగతులు ఉంటాయని,అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐలు శ్రీనివాస్, గోవిందరావు,నర్సింహారావు,ఎస్ఐ వీరన్న,ఆర్ఎస్ఐలు సాయి,సురేష్,రాజశేఖర్,అశోక్,రెహమాన్,సిబ్బంది, హార్ట్ ఫుల్ నెస్ ధ్యానకేంద్ర మెడిటేషన్ శిక్షకులు గోవర్ధన్ గిరి,సుధారాణి,యువత పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube