సినిమా వాళ్లకు ఆదాయం దండిగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే.వారికి వచ్చిన ఆదాయాన్ని బట్టే పన్నులు కూడా కడుతూ ఉంటారు.
అప్పట్లో పన్నులను సక్రమంగా చెల్లించే నటీనటులకు ప్రశంస పత్రాలతో పాటు అవార్డులు కూడా ఇచ్చేవారు.ఇలా సినిమా వారిని సన్మానించడం లో తమిళ నాడు ప్రభుత్వం ( Government of Tamil Nadu )ఎప్పుడు ముందు ఉండేది.
సినిమా ఇండస్ట్రీ అంత కూడా అక్కడే ఉండేది కాబట్టి వారి ఆదాయపు పన్నులు కూడా ఆ రాష్ట్రానికే చెందేవి.ఇక జయలలిత( Jayalalithaa ) హయాంలో కూడా అలాగే జరిగింది.
ఆవిడా కూడా సినిమా వారిని ఎప్పుడు చిన్న చూపు చూసింది లేదు.

ఇక సినిమా వారికి సంబందించిన ఆడిటింగ్ వ్యవహారాలను ఎక్కువగా బ్రహ్మయ్య అండ్ కో అనే కంపెనీ ( Brahmaiah and Co company )ఎక్కువగా చూసుకునేది.నటి సూర్యకాంతమ్మ( Actress Suryakantham ) కు సంబందించిన లెక్కలు కూడా ఈ కంపెనీ చేతుల్లోనే ఉండేవి.అయితే సూర్యకాంతమ్మ కు మాత్రం ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించకపోయిన కూడా ప్రభుత్వ అవార్డులు, సన్మానాలు దక్కేవి.
అదేంటి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా ప్రభుత్వం నుంచి సన్మానం ఎలా చేయించుకునేవారు అనే కదా మీ అనుమానం.అక్కడే ఉంది అస్సలు విషయం.సూర్యకాంతమ్మ భర్త న్యాయవాది గా ఉండేవారు మద్రాసులో.

ఆయనకు ఉన్న పేరు ప్రతిష్టలు పోకుండా ఉండాలంటే బాగా దానధర్మాలు చేయాలనీ సూర్యకాంతమ్మ నిర్ణయించుకున్నారు.అందువల్ల ప్రతి రూపాయి కూడా టాక్స్ పే చేయకుండా ఇలా దానధర్మాలు రూపంలో ఖర్చు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు.కానీ చేసింది సహాయమే కాబట్టి అప్పటి ప్రభుత్వాలు ఆమెను సత్కరించేవి.
ఇలా ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టకుండా ఆమె వారి సంపాదనను పేదల కోసం ఉపయోగించేవారు.అంతే కాదు ప్రభుత్వ సేవ నిధి కి ఆమె చాల డబ్బు ను విరాళంగా ఇచ్చేవారట.
ఇంత కష్టపడి సంపాదించినా సొమ్మును సూర్యకాంతమ్మ చివరి దశలో లాయర్లను నమ్మి పోగొట్టుకున్నారని అందరు చెప్తూ ఉంటారు.పైగా ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల ఒకవేళ ఆస్థి ఉన్న ఎవరి పాలయ్యేదో ఏమో మరి.