అక్కినేని హీరోలైన నాగచైతన్య( Naga Chaitanya ), అఖిల్ వేగంగా సినిమాలు చేయడంతో పాటు సరైన రిలీజ్ డేట్లను ప్లాన్ చేసుకుని తమ సినిమాలను ఆ తేదీలకు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే ఏఎన్నార్ స్థాయిలో నాగచైతన్య కానీ అఖిల్ కానీ సక్సెస్ సాధించలేదు.
నటన పరంగా తమదైన ముద్ర వేసుకునే విషయంలో ఈ ఇద్దరు హీరోలు ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే.

అయితే కెరీర్ పరంగా చైతన్య, అఖిల్ చేసిన పొరపాట్ల వల్లే వాళ్లు ఆశించిన స్థాయికి చేరుకోలేదు.నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఒకటి రెండు మినహా మిగతా సినిమాలన్నీ పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించారు.వరుసగా విజయాలు సాధించే విషయంలో నాగచైతన్య తడబడటం కూడా నాగచైతన్యకు మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సరైన కథలను ఎంచుకునే విషయంలో నాగచైతన్య ఫెయిల్ అవుతున్నారు.

నాగచైతన్య పరిస్థితి కొంత బెటర్ గా ఉన్నా అఖిల్ పరిస్థితి ఘోరంగా ఉంది.అఖిల్( Akhil Akkineni ) కెరీర్ లో ఇప్పటివరకు 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా ఏమీ లేదనే సంగతి తెలిసిందే.ఏజెంట్( Agent ) సినిమా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కేవలం 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

నాగచైతన్య, అఖిల్ రాబోయే రోజుల్లో అయినా ఉన్నత స్థానాలకు చేరుకుంటారేమో చూడాల్సి ఉంది.నాగార్జున చైతన్య, అఖిల్ కెరీర్ పై దృష్టి పెట్టాల్సి ఉంది.చైతన్య, అఖిల్ రెమ్యునరేషన్లు వేర్వేరుగా 10 కోట్ల రూపాయల కంటే తక్కువగానే ఉందని తెలుస్తోంది.
నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.మే నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అఖిల్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.







