ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి మన జీవితాలలో శాశ్వత స్థానాన్ని తీసుకుంది.పని ఒత్తిడితో వ్యక్తిగత సమస్యలు రావచ్చు.
ఒత్తిడి దాదాపు ప్రతి ఒక్కరిని వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రభావితం చేసి ఉంటుంది.కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
వాటిలో ఒకటి ఆహారంలో మార్పులు చేసుకోవడం.ఆహారం మన శరీర మానసిక స్థితి భావోద్వేగాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.
సరైన ఆహారం తినకపోతే ఒత్తిడి, ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.సమతుల ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఒత్తిడి తగ్గిపోతుంది.ఒత్తిడి సమయంలో దూరంగా ఉంచవలసిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొందరు వ్యక్తులు నొప్పి, ఒత్తిడి నుంచి బయటపడడానికి మద్యపానాన్ని సులభమైన మార్గంగా భావిస్తారు.
వాస్తవానికి మద్యం ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది కానీ తగ్గించదు.ఆల్కహాల్ అనేది మీ మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్ మీటర్.
ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.ఇది మీ పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తుంది.సెరోటోనిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు అది ఆందోళన నిరాశ భావాలకు దారి తీస్తుంది.అంతేకాకుండా ఆల్కహాల్ నిద్ర కు భంగం కలిగిస్తుంది.ఇది ఒత్తిడి, ఆందోళనలను పెంచుతుంది.ఒత్తిడి సమయంలో మద్యపానాన్ని నివారించడం ఎంతో మంచిది.
కొందరు వ్యక్తులకు పాల ఎలేర్జీ ఉంటుంది.ఇది జీర్ణ సమస్యలు, ఉబ్బరం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.ఈ రకమైన ఆహారాలు శరీరంలో ప్రతికూల ప్రతిచర్యను కూడా సృష్టించగలవు.ఇది ఒత్తిడి, ఆందోళనకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది.అటువంటి పరిస్థితులలో మీకు కూడా ఈ సమస్య ఉంటే మీరు పాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.