కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు వైద్యాధికారులు,మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఆయన మాట్లాడుతూ 2023 జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని,అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.10 సంవత్సరాల వయసు నిండిన వారి నుండి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని,జిల్లాలో సుమారుగా 13 లక్షల 50 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందన్నారు.రూరల్ ప్రాంతంలో 9 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.

 Kanti Velam Program Should Be Successful: Collector-TeluguStop.com

జిల్లాలో మొత్తం 50 టీములను ఏర్పాటు చేయనున్నట్లు,రూరల్ ప్రాంతంలో 35 టీములు,అర్బన్ మున్సిపాలిటీలలో 10 టీములను,ఐదు టీములను స్టాండ్ బైగా ఉంచుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి డాక్టర్లు 50 మంది,ఏఆర్ మిషనరీలు 50,లెన్స్ బాక్సులు 50, స్పైనల్ చార్ట్స్ 50,టార్చ్ లైట్స్ 50, ఆఫ్తామాలజిస్టు అసిస్టెంట్స్ 50 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 50 మంది, వాహనాలు 50,ఒక ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మున్సిపాలిటీలలో వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాలను నిర్వహించాలన్నారు.వైద్యశాఖ అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.కంటి వెలుగు కార్యక్రమానికి హాజరవుతున్న వైద్య సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అరుణాచలం,మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,అశోక్ రెడ్డి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.–

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube