సూర్యాపేట జిల్లా:గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ( S.
Venkatarao )అన్నారు.జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్.
ప్రియాంక తో కలిసి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో ప్రాథమిక అవసరాలను గుర్తించి సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామ అభివృద్ధి ప్రణాళికపై పంచాయతీ కార్యదర్శులతో ఇంజనీరింగ్, మహిళ అభివృద్ధిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన గ్రామపంచాయతీలలో 9టిములలో 409 అంశాలలో అభివృద్ధి ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలన్నారు.
గ్రామాల్లో పనిచేస్తున్న శాఖలను సమన్వయం చేసుకుని గ్రామ సభలను నిర్వహించి ప్రణాళిక రూపొందించి,ఈ గ్రామసభ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలను నిర్వహించాలని,శిశు, మహిళ అభివృద్ధి, ఆరోగ్యం అంశాలపై పరిశీలించి గ్రామ సభలో వివరాలు తెలియజేయాలన్నారు.
ప్రజలతో,గ్రామ పంచాయతీ పాలకవర్గంలో చర్చించి శానిటేషన్,గ్రామాలలో రోడ్లు, మరుగుదొడ్లు,అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులు చేసే విదంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు,రోడ్లు, భవనాల నిర్మాణాలు, త్రాగునీరు,వ్యవసాయం,ఇతర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.
రూపొందించిన ప్రణాళికల వివరాలను ఈనెల 30వ తేదీలోగా ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు.