సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం పాశ్చా నాయక్ తండా గ్రామానికి చెందిన ధరావత్ రవి తో పాటు పాశ్చా నాయక్ తండ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధరావత్ మస్తాన్ లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో బీజేపీలో చేరారు.వారికి కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ జగదీశ్ రెడ్డిని ఎవరూ ఓడించవలసిన పని లేదని,ఆయన అహంకారమే ఆయనను ఓడిస్తుందని అన్నారు.మంత్రి అవినీతి చేయడం మానడు,నేను అవినీతిని ప్రశ్నించడం మాననని చెప్పారు.దళితులకు దళితబంధు ద్వారా రూ.10 లక్షలు ఇచ్చినప్పుడు గిరిజనులకు గిరిజన బంధు ద్వారా రూ.10 లక్షలు ఎందుకు ఇవ్వరని, గిరిజన సోదరులు కేసీఆర్ కు ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు.ధరణి పోర్టల్ ను తీసుకువచ్చి అన్నదమ్ముల పొలాల మధ్య గెట్టు పంచాయతీ పెట్టారని ఆరోపించారు.
ఒకే నెలలో ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచి,పేద,మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.విద్యుత్ చార్జీలు,భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు విపరీతంగా పెంచుతున్నారని అన్నారు.గెలిచినా ఓడినా వచ్చే ఎన్నికల్లోనే నా చివరి పోటీ అని స్పష్టం చేశారు.