ఆచార్య 25 శాతం కూడా రికవరీ కాలేదా.. డిస్ట్రిబ్యూటర్ కష్టాలు వింటే షాకవ్వాల్సిందే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అని మెగా ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు.మెగా అభిమానులలో చాలామందికి ఈ సినిమా నచ్చలేదు.

 Interesting Facts About Acharya Movie Losses Details Here Goes Viral , Acharya-TeluguStop.com

సినిమాలో విలన్ పాత్రలను పవర్ ఫుల్ గా చూపించలేదని కథ కన్ఫ్యూజింగ్ గా ఉందని మెగా ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపించాయి.ఇప్పటికే ఈ సినిమా చాలా థియేటర్లను కోల్పోయింది.

సర్కారు వారి పాట విడుదలైతే ఈ సినిమా మరికొన్ని థియేటర్లను కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది.

అయితే ఆచార్య సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

రాజ‌గోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ ఆచార్య సినిమా హక్కులను నైజాం కర్ణాటక బోర్డర్ తెలుగు ఏరియాల కొరకు తీసుకున్నారు.అయితే ఈ డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడిలో కనీసం 25 శాతం కూడా రికవరీ కాలేదని సమాచారం.

ఈ డిస్ట్రిబ్యూటర్ ఒక లేఖ ద్వారా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాను ఏడాది క్రితమే ఆచార్య సినిమాకు అడ్వాన్స్ ఇచ్చానని సినిమా విడుదలకు ముందు పూర్తి మొత్తం ఇచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

చిరంజీవి న్యాయం చేయాలని ఈ డిస్ట్రిబ్యూటర్ కోరడం గమనార్హం.వరంగల్ శ్రీను నుంచి ఈ డిస్ట్రిబ్యూటర్ హక్కులను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది.

ఈ లేఖ గురించి చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Acharya, Chirenjeevi, Koratala Shiva, Ram Charan, Warangal Srinu-Movie

ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను భర్తీ చేయడం కూడా సులువు కాదు.ఆచార్య సినిమాకు 160 కోట్ల రూపాయల వరకు ఖర్చైందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఆచార్య నష్టాలు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారంగా మారనున్నాయని తెలుస్తోంది.

మెగాస్టార్ ఈ నష్టాలను త్వరగా భర్తీ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube