సూర్యాపేట జిల్లా:లోక్ సభ ఎన్నికలు చేపట్టేందుకు ఈసిఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై ఎస్పీ రాహుల్ హెగ్డే,అదనపు కలెక్టర్ బిఎల్.లతతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈసిఐ తేదీ 16.3.2024న మద్యాహ్నం 3.00 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు.గెజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 18.4.2024 న, నామినేషన్ల చివరి తేదీ 25.4.2024న,నామినేషన్ల పరిశీలన 26.4.2024 ఉంటుందని,పోటీ అభ్యర్థులు ఉపసంహరణ తేదీ.29.4.2024న ఉంటుందని తెలిపారు.పోలింగ్ నిర్వహణ తేదీ.13.5.2024 అలాగే తేదీ 4.6.2024న కౌంటింగ్ నల్గొండలో ఉంటుందని తెలిపారు.13-నల్గొండ పరిధిలోని 89- హుజూర్ నగర్,90-కోదాడ,91- సూర్యాపేట,అలాగే 14- యాదాద్రి భువనగిరి పరిధిలోని 96-తుంగతుర్తి (ఎస్సీ) ఉందని తెలిపారు.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1201 పోలింగ్ కేంద్రాల ఉన్నాయని అలాగే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 4,87,234,మహిళ ఓటర్లు 5,09,205,ట్రాన్స్ జెండర్స్ 54 అలాగే సర్వీస్ ఓటర్లు 470,ఎన్ఆర్ఐ ఓటర్లు 102 మొత్తం కలసి 9,97,065 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
అదే విధంగా నాలుగు నియోజకవర్గాల్లో వికలాంగులైన పురుష ఓటర్లు 9814 మంది,మహిళ ఓటర్లు 7380 మొత్తం 17195 మంది ఉన్నారని అన్నారు.జిల్లాలో ఎన్.ఆర్.ఐ పురుష ఓటర్లు 83 మంది,మహిళ ఓటర్లు 19 మొత్తం 102 మంది ఉన్నారని తెలిపారు.అలాగే నాలుగు నియోజక వర్గాల్లో 112 రూట్స్ ఏర్పాటు,సెక్టార్ అధికారులు 123 మందిని నియమించనున్నట్లు తెలిపారు.జిల్లాలోని 1201 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు చేపట్టేందుకు బి.యులు 2691,సి.యు.లు1738 వివిఫ్యాట్స్ 1849 మొదటి లివల్ ఎఫ్.ఎల్.సి చేపట్టామని అలాగే 18 క్యాటగిరీలలో సిబ్బందికి శిక్షణ అందించామని తెలిపారు.అదే విధంగా 16 మద్యాహ్నం 3.00 గంటల నుండి మోడల్ కోడ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని జిల్లాలో 12 ఎఫ్.ఎస్.టి,12 ఎస్.ఎస్.టి,వి.ఎస్.టి 4,వివిటి 4 మొత్తం 32 టీమ్స్ ఏర్పాటు చేశామని నిర్దేశించిన ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు 6635 మంది సిబ్బందిని సిద్ధం చేశామని అట్టి వివరాల డేటా ముఖ్య ఎన్నికల అధికారి సైట్ లో పొందు పరిచామని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఈసిఐ నిబంధనల మేరకు 85 సంవత్సరాలు పైబడిన వారందరికీ,40 శాతం అంగవైకల్యం ఉన్న వారందరికీ హోమ్ ఓటింగ్ చేపడతామని అలాగే ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఈడిసి సర్టిఫికేట్ తో పని చేసే చోట ఓటుహక్కు వినియోగంచుకోవచ్చని, ఇతర జిల్లాల అధికారులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికల విదంగా లోక్ సభ ఎన్నికలు కూడా పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా నిర్వహిస్తాని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా చేపట్టినందుకు జిల్లాకు అవార్డు అందుకున్నామని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఎన్నికలు సమర్థవంతంగా చేపట్టేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు.
లైసెన్స్ వేపల్స్ స్వాధీనం చేసుకుంటామని,అన్ని చెక్ పోస్టుల్లో గట్టి నిఘా పెంచుతామన్నారు.ఇప్పటికే రెండు పోలీస్ బలగాలు జిల్లాకు వచ్చాయని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిపిఆర్ఓ రమేష్ కుమార్,డిఇఓ ఆశోక్,డిఈఈ మల్లేశం,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు