ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది.గతంలో తీసిన సినిమాలు పరాజయం పాలైనప్పటికీ ఏదో ఒక రకంగా తంటాలు పడి పాన్ ఇండియా సబ్జెక్టులు ఎంచుకొని స్టార్ హీరోలతో ఓకే చేయించుకుని సినిమాల తీయడం అయితే మొదలు పెట్టారు.
కానీ ఇది వారికి కెరియర్ లో అతిపెద్ద రిస్క్ ఉన్న స్టేజ్ లాంటిది.గత పరాజయం తాలుకు గాయాలు అలాగే ఉంటాయి.
ఇక ఈ సినిమా కూడా పరాజయం అయితే వారి కెరియర్ దాదాపు ముగిసిపోయినట్టే.అందుకే ఇప్పుడు కొంతమంది దర్శకులు ఎంతో ఇబ్బందులు ఉన్న కష్టపడి తమ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
మారి ఈ సినిమాలు వారికి విజయాన్ని అందిస్తాయో లేదో తెలియదు.అలా పరాజయాలు ఉన్న ఆ దర్శకులు ఎవరు ? వారు తీస్తున్న ఫ్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ ఏంటి ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొరటాల శివ
( Koratala Shiva )
చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా వచ్చిన ఆచార్య సినిమా ( Acharya movie ) పరాజయం కొరటాల శివ కెరియర్ పై బాగానే పడింది.అయితే జూనియర్ ఎన్టీఆర్ అంతకన్నా ముందే దేవరా సినిమా కు కమిట్ కావడంతో కొరటాల శివ పై నమ్మకంతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ సినిమా రెండు పార్టులుగా విడుదలవుతోంది.అయితే పాన్ ఇండియా సబ్జెక్టు అయిన దేవర కొరటాల శివకు అగ్ని పరీక్ష లాంటి సినిమా.మరి ఈ సినిమా తో శివ ఏమాత్రం సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.
పూరి జగన్నాథ్
( Puri Jagannath )
లైగర్ సినిమా ప్లాప్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమా ( Double Ismart movie )అతనికి అతిపెద్ద చాలెంజ్ చిత్రం అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా ఫ్యాన్ ఇండియా సినిమాగా రాబోతోంది.ఇప్పటికే పూరి ఖాతాలో చాలా ఫ్లాప్ చిత్రాలు వచ్చి చేరాయి.ఇక హీరో రామ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది.

సుజిత్
( Sujith )
పవన్ కళ్యాణ్ హీరోగా DVV దానయ్య నిర్మాణంలో వస్తున్న సినిమా ఓజి సినిమా కన్నా ముందు సుజిత్ సాహో అనే చిత్రాన్ని తీశాడు.ప్రభాస్ బాహుబలి తర్వాత వచ్చిన సినిమా సాహో పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల అయినప్పటికీ అనుకున్న మేర విజయాన్ని ఇవ్వలేదు.దాంతో అతని ఆశలన్నీ కూడా ఓజీ సినిమా పైనే ఉన్నాయి.70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తోంది.

శంకర్
( Shankar )
రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్.ఇప్పటికే ఐ, రోబో 2.0 సినిమాలు కేవలం పరవాలేదనిపించాయి.అలాగే ఇండియన్ 2 సినిమా ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి.ఇన్ని కష్టాలు నడుమ రాం చరణ్ తో సినిమా రాబోతోంది.మరి ఈ సినిమా శంకర్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మారుతి
( Maruti )
ఇప్పటి వరకు అనేక చిన్న సినిమాలకు దర్శకత్వం వహించిన మారుతి రాజా సాబ్ చిత్రంతో మొట్టమొదటిసారి ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కి సినిమా తీస్తున్నారు.మరి ఇది కూడా మారుతీకి కత్తి మీద సామూలాంటి సినిమానే.







