టీఆర్ఎస్ జాతీయ రహదారుల ముట్టడి

సూర్యాపేట జిల్లా:టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు,తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాలతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక మరియు ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జనగామ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారుల దిగ్భంధన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రతీ ఒక్కరూ ఖందించాలని పిలుపునిచ్చారు.

 Siege Of Trs National Highways-TeluguStop.com

పంజాబ్ రాష్ట్రంలో 100% వడ్ల కొనుగోలు ఏవిధంగా చేస్తున్నావో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రైతుల వడ్లు కొనుగోలు చేసి తీరాలని డిమాండ్ చేశారు.ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధిలో కొనసాగుతున్న తీరును చూసి ఓర్వలేక తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎం ఎస్సీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్,రైతు సమన్వయ సమితి కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రజాక్,సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,సూర్యాపేట వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్,జడ్పిటిసి జీడీ భిక్షం,ఎంపీపీ రవీందర్ రెడ్డి,సూర్యాపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు,రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులు కక్కిరేణి నాగయ్య,సూర్యాపేట జిల్లా రైతులు,ప్రజా ప్రతినిధులు,సూర్యాపేట పట్టణ కౌన్సిలర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,రైతు సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube