జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను క్రమబద్ధీకరించాలి: కెవిపిఎస్

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతి సెక్రటరీలను తక్షణమే క్రమబద్దీకరించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున( Paladugu Nagarjuna ) డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన నిరవధిక సమ్మె 11 వరోజు కు చేరుకున్న సందర్భంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు.

 Junior Panchayat Secretaries To Be Regularized Kvps , Kvps, Junior Panchayat Se-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ సెక్రటరీల సకల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటూ వారి పట్ల సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందన్నారు.ముగిసిన ప్రొబిషన్ పిరియడ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన జీవోకు కట్టుబడి వారిని క్రమబద్ధీకరించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.ప్రాథమిక అవసరాలు తీరని రూ.15వేల జీతాలతో 60/70 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారి విధులు నిర్వర్తిస్తున్నా రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, మొదటగా మూడేళ్ల ప్రొబిషన్ పిరియడ్( Prohibition period ) అని తర్వాత ముఖ్యమంత్రి మరో సంవత్సరకాలం పెంచి మొత్తం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత కూడా క్రమబద్ధీకరణలో తాత్సారం చేయడం చూస్తుంటే ఇది మాటల ప్రభుత్వమే గాని చేతల ప్రభుత్వం కాదని స్పష్టమవుతుందన్నారు.ఈ జీతభత్యాలు కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఇస్తున్నారన్నారు.9,000 మంది పంచాయతీ సెక్రటరీల క్రమబద్ధీకరణ( Regularization of Panchayat Secretaries ) డిమాండ్ న్యాయబద్ధమైనదన్నారు.పక్క రాష్ట్రంలో రెండేళ్ల కాలానికే సెక్రెటరీలను క్రమబద్ధీకరణ చేసిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోవొద్దు అన్నారు.11 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి బేషరతుగా సమ్మె విరమింపజేయాలని, నెలరోజుల తర్వాత రెగ్యులర్ చేస్తామని మాట దాటవేయడం మంచిది కాదన్నారు.ఈ కార్యక్రమంలో కోడి రెక్క శైలజ,అశోక్,నరేష్ యాదవ్,షేక్ అసిఫ్, వెంకటేష్,ఝాన్సీ,ఉపేందర్,రాజశేఖర్,ప్రవీణ్,వెంకన్న, సుజిత్,పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube