ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. బర్త్ డే బ్లాస్ట్ ఏంటంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr NTR ) మే 20న తన పుట్టిన రోజును జరుపుకో నున్నారు అనే విషయం తెలిసిందే.ఈయన ఫ్యాన్స్ తారక్ పుట్టిన రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.

 Ntr30 Latest Update On Ntr Birthday Details, Ntr30, Ntr, Koratala Shiva, Ntr30 U-TeluguStop.com

ఎందుకంటే తారక్ బర్త్ డే రోజు అదిరిపోయే అప్డేట్ వస్తుంది అని ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు.మరి ఈసారి కూడా తారక్ నటిస్తున్న కొత్త సినిమా (NTR30) నుండి బర్త్ డే బ్లాస్ట్ ఉందని అంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో సంచలనం సృష్టించిన తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరగడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి మే 20న అదిరిపోయే అప్డేట్ వస్తుంది అని టాక్.

తాజాగా సినీ వర్గాల్లో వస్తున్న సమాచారం ప్రకారం ఈ ఈ సినిమా నుండి ఎన్టీఆర్ బర్త్ డే (NTR Birthday) కానుకగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారట.మరి ఈ ఫస్ట్ లుక్ వీడియో మోషన్ పోస్టర్ తో పాటు ఇందులో వినిపించే వాయిస్ ఓవర్ కూడా హైలెట్ గా ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి.ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులోకి అడుగు పెట్టబోతోంది.అలాగే విలన్ రోల్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube