సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలంలోని చనుపల్లి,కిష్టాపురం, మొగలాయికోట, శాంతినగర్,గొండ్రియాల, కొత్తగూడెం గ్రామాలను ఆనుకొని వెళ్తున్న పాలేరు వాగు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారింది.బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం వెళ్లడంతో గొండ్రియాల నుండి ఖమ్మం వెళ్ళే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కానీ, నాలుగు రోజుల తర్వాత అధికారులు స్పందించి ఇక్కడి రవాణా వ్యవస్థను బంద్ చేశారు.అయితే భారీ వర్షాలతో వాగు పరిసరాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతూ ప్రమాదకర స్థాయికి చేరితే ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని,కానీ, అటువంటి దాఖలాలు లేవని అంటున్నారు.గొండ్రియాల నుండి ఖమ్మం వెళ్లాలంటే పాలేరు వాగు బ్రిడ్జిపై నుండి వెళ్లడమే మార్గమని,బ్రిడ్జి పై నుండి వరద ప్రవహిస్తుంటే సంబంధిత అధికారులు పర్యవేక్షణ కరువైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంతోష్ కిరణ్,ఎంపీడీవో విజయశ్రీ, ఇరిగేషన్ డిఈ రాంప్రసాద్,ఎంపిఓ జగదీష్,ఇరిగేషన్ ఏఈ జీవన్ కుమార్,ఐసీడిఎస్ సూపర్వైజర్ మంగమ్మ, స్థానిక సర్పంచ్ నెల్లూరి లీలావతి,ఎంపిటిసి మన్నెం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.