భారత ఫుట్ బాల్ పురుషుల, మహిళల జట్లకు ఆసియా గేమ్స్ ( Asian Games )లో పాల్గొనేందుకు భారత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతంలో ఆసియా ర్యాంకింగ్ లను పరిగణలోకి తీసుకొని నిబంధనల ప్రకారం ఆసియా గేమ్స్ లో పాల్గొనేందుకు భారత ఫుట్ బాల్( Indian Football ) జట్లకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదు.
కానీ ఇటీవలే భారత ఫుట్ బాల్ జట్టు అద్భుత ఆట ప్రదర్శన, మరోక పక్క ఫుట్ బాల్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న అభ్యర్థనలతో స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆసియా గేమ్స్ లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ నెలల మధ్యలో చైనాలో ( China )జరుగనున్న ఆసియా గేమ్స్ లో పాల్గొనేందుకు భారత పురుషుల, మహిళల ఫుట్ బాల్ జట్లకు అనుమతి ఇచ్చింది.ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్( Anurag Thakur ) బుధవారం ట్వీట్ ద్వారా తెలియజేశారు.ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆసియా గేమ్స్ లో తలపడేందుకు భారత జట్లు అర్హత సాధించే పరిస్థితులలో లేకపోయినా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సడలింపు ఇచ్చింది.
భారత జట్లు ఆసియా గేమ్స్ లో అద్భుత ఆటను ప్రదర్శించి, దేశం గర్వించేలా చేస్తారని తాను నమ్ముతున్నానని అనురాగ్ ఠాగూర్ ట్వీట్ చేశారు.
క్రీడా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఆసియాలో టాప్-8 ర్యాంకుల్లో ఉండే జట్లను మాత్రమే ఆసియా గేమ్స్ కు పంపించాలి.సునీల్ ఛెత్రి కెప్టెన్సీ( Sunil Chhetri ) ఆధ్వర్యంలో భారత పురుషుల ఫుట్ బాల్ జట్టు ఆసియాలో 18 వ ర్యాంకులో ఉంది.ఫిఫా ర్యాంకింగ్లో 99 వ ర్యాంకులో ఉంది.
ఈ ఏడాది కాంటినెంటల్ కప్, శాప్ ఛాంపియన్ షిప్ లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది.ఇక భారత మహిళల జట్టు కూడా ఇటీవలే కాస్త అద్భుత ఆటనే ప్రదర్శిస్తుంది.
ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఆసియా గేమ్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.సోషల్ మీడియా వేదికగా ఫుట్ బాల్ ఆటగాళ్లతో పాటు అభిమానులు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.